News February 12, 2026

కృష్ణా-వికారాబాద్ రైలు మార్గం.. కేంద్రానికి CM విజ్ఞప్తి

image

కృష్ణా-వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధుల‌తో చేప‌ట్టాల‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేక‌ర‌ణ వ్య‌యాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. గురువారం ఢిల్లీలో అశ్వినీ వైష్ణ‌వ్‌‌తో పార్ల‌మెంట్‌లోని ఛాంబ‌ర్‌లో భేటీ అయి దీనిపై చర్చించారు.

Similar News

News March 13, 2026

యాసంగికి పోచారం నీటి విడుదల ముమ్మరం

image

పోచారం ప్రాజెక్టు నుంచి యాసంగి పంటల కోసం నీటి విడుదల కొనసాగుతోంది. శుక్రవారం 247 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 0.695 టీఎంసీల నీటిని వదిలినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.870 టీఎంసీల నీరు నిల్వ ఉందని, నీటి వినియోగంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

News March 13, 2026

ఏపీ క్యాబినెట్ సమావేశం.. 27 అంశాలకు ఆమోదం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ భేటీ ముగిసింది. 27 అజెండా అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా అనారోగ్యం కారణంగా ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత సహా మంత్రులు నాదెండ్ల మనోహర్, గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్, ఎండీ ఫరూక్ హాజరుకాలేదు.

News March 13, 2026

అబ్రార్‌ది యునిక్ బౌలింగ్.. అందుకే తీసుకున్నాం: SRH హెడ్ కోచ్

image

The Hundred(ఇంగ్లండ్) టోర్నీ కోసం పాక్ స్పిన్నర్ అబ్రార్‌ను తీసుకోవడంపై SRH హెడ్ కోచ్ వెటోరీ స్పందించారు. ‘అతనిది యునిక్ బౌలింగ్. ఎన్నో వేరియేషన్స్‌తో బౌలింగ్ చేస్తారు. ఇలాంటి ప్లేయర్లను గతంలో చూసి ఉండరు. టోర్నీకి అందుబాటులో ఉంటాడనే వేలంలో కొనుగోలు చేశాం’ అని పేర్కొన్నారు. కాగా పాక్ ఆటగాడిని సన్ రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై వస్తున్న <<19368622>>తీవ్ర విమర్శలపై<<>> ఓనర్ కావ్యా మారన్‌ స్పందించలేదు.