News November 2, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలలో బీఈడీ చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ (2021, 22, 23 బ్యాచ్లు) సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ థియరీ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 11లోపు ఎలాంటి అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. నవంబర్ 26 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తామని, ఫీజు వివరాలకై https://kru.ac.in/ వెబ్సైట్ చూడాలంది.
Similar News
News November 6, 2025
పంట నష్టం నమోదు పారదర్శంగా జరుగుతుంది: కలెక్టర్

కృష్ణా జిల్లాలో పంట నష్టం లెక్కింపు ప్రక్రియపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేవికావని కలెక్టర్ బాలాజీ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా పంట నష్టం లెక్కింపు కార్యక్రమం గత 7 రోజులుగా అధికారుల సమక్షంలో నిరంతరంగా పారదర్శకంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు.
News November 6, 2025
కృష్ణా: మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థులు వీరే.!

రాష్ట్ర ప్రభుత్వం తరఫున త్వరలో నిర్వహించనున్న మాక్ అసెంబ్లీ కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా నుంచి మొత్తం ఏడు నియోజకవర్గాల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేశారు. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎస్. వాగ్దేవి (8వ తరగతి), పెడన- పి. చాందిని 10th, ఉయ్యూరు-ఉప్పాల అక్షయ 10th, గుడివాడ-వి.అక్షిత 10th, గన్నవరం-పి.చరిత 10th, పామర్రు-పాముల హిమబిందు 10th, అవనిగడ్డ-హిమాంజలి 9th. ఎంపికయ్యారు.
News November 6, 2025
కృష్ణా: పంచారామాల బస్సులకు.. ఆన్లైన్ రిజర్వేషన్

పంచారామాలు, అరుణాచలం, విశిష్ఠ శైవ క్షేత్రాలు, అలాగే యాగంటి, మహానంది, శ్రీశైలం త్రిలింగ దర్శినికి RTC ప్రత్యేక బస్సులు నడుపుతోంది. నవంబర్ 8,9 తేదీల్లో అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, ఉయ్యూరు డిపోల నుంచి శని, ఆదివారం రాత్రి స్పెషల్ సర్వీసులు నడవనున్నాయని RTC అధికారులు తెలిపారు. ప్రయాణికులు ONLINEలో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చుని సూచించారు.


