News April 4, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల

కృష్ణా వర్శిటీ పరిధిలోని LL.B/B.A.LL.B విద్యార్థులు రాయాల్సిన 1,5వ సెమిస్టర్ (2023 రెగ్యులేషన్) థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 15, 18, 20, 23, 25 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు KRU అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని, 70 మార్కులకు ఈ పరీక్షలు జరుగుతాయని వర్శిటీ వర్గాలు తెలిపాయి.
Similar News
News April 25, 2025
కృష్ణా: ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్త.!

జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు APSDMA తెలిపింది. శుక్రవారం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ప్రాంతాలను వెల్లడించింది. బాపులపాడు 40.8°, గన్నవరం 41.2°, గుడివాడ 40.2°, కంకిపాడు 40.7°, నందివాడ 40.1°, పెనమలూరు 40.9°, ఉంగుటూరు 40.9°, పెదపారుపూడి 40.3°, తోట్లవల్లూరు 40°, ఉయ్యూరు 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News April 25, 2025
మోపిదేవి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

కృష్ణా జిల్లా మోపిదేవి వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు.. అవనిగడ్డకు చెందిన యాసాబాల భాస్కర్ (21), బంతుల సుధాకర్ (18) చల్లపల్లి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
News April 25, 2025
విజయవాడ: ఒకే జైలులో నలుగురు నిందితులు

విజయవాడ జిల్లా జైలులో కీలకమైన కేసులలో నిందితులుగా ఉన్న నలుగురు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. సత్యవర్ధన్ అనే యువకుడి కిడ్నాప్ కేసులో మాజీ MLA వంశీ, జత్వాని కేసులో రిమాండ్ విధింపబడటంతో ఇంటెలిజెన్స్ విభాగ మాజీ అధిపతి PSR ఆంజనేయులు రిమాండ్ ఖైదీలుగా ఉండగా.. లిక్కర్ కుంభకోణం కేసులో రాజ్ కెసిరెడ్డి, ఇదే కుంభకోణంలో A8గా ఉన్న చాణక్యకు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో పోలీసులు ఇదే జైలుకు తరలించారు.