News January 5, 2025

కృష్ణా: విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక

image

2025-26 సంవత్సరానికి సంబంధించి అమలు చేయనున్న విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై విజయవాడలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరగనుంది. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం ఈనెల 7,8 తేదీలలో బృందావన కాలనీలోని ఏ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నామని APCPDCL తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. పై తేదీలలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకు వినియోగదారులు అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరిస్తామంది. 

Similar News

News November 27, 2025

కైకలూరు కృష్ణాజిల్లాలోకి తిరిగి వచ్చేనా..!

image

ఒకప్పుడు కృష్ణాజిల్లాలో భాగంగా ఉన్న కైకలూరు నియోజకవర్గం మళ్లీ జిల్లాలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాల పునర్విభజనకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత YCP హయాంలో కైకలూరును ఏలూరు జిల్లాలోకి తీసుకువెళ్లారు. ఈ విలీనాన్ని వ్యతిరేకించిన నియోజకవర్గ ప్రజలు కృష్ణాజిల్లాలోనే కొనసాగించాలన్న డిమాండ్ ను బలంగా వినిపించారు. మరి కూటమి ప్రభుత్వం కైకలూరును జిల్లా పరిథిలోకి తెస్తారో, లేదో చూడాలి.

News November 25, 2025

కృష్ణా: MLAలకు తలనొప్పిగా మారిన జిల్లాల పునర్విభజన

image

జిల్లాల పునర్విభజన కృష్ణాజిల్లాలో ఎమ్మెల్యేల మధ్య కొత్త వివాదానికి తెరలేపింది. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల విలీనం విషయంలో ఏకాభిప్రాయం రావడం లేదు. విజయవాడకు ఆనుకుని ఉన్న ఈ రెండు నియోజకవర్గాలను NTR జిల్లాలో విలీనం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంలో గన్నవరం MLA యార్లగడ్డ పట్టుబట్టి కూర్చున్నారు. అలా చేస్తే జిల్లా విస్తీర్ణం తగ్గి ప్రాధాన్యత కూడా తగ్గిపోతుందని ఇతర MLAలు అంటున్నారు.