News July 4, 2024

కృష్ణా: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

విజయవాడ నుంచి ముంబైకు ఆగస్టు 16 నుంచి నాన్ స్టాప్ ఫ్లైట్స్ నడపనున్నట్లు ఇండిగో సంస్థ తెలిపింది. విజయవాడలో రాత్రి 9 గంటలకు బయలుదేరే ఈ ఫ్లైట్ రాత్రి 11 గంటలకు ముంబై చేరుకుంటుందని, ముంబైలో సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరే ఈ ఫ్లైట్ రాత్రి 8.20 గంటలకు విజయవాడ చేరుకుంటుందని ఆ సంస్థ పేర్కొంది. వివరాలకు ఇండిగో సంస్థ అధికారిక వెబ్‌సైట్ చూడాలని స్పష్టం చేసింది.

Similar News

News October 8, 2024

విజయవాడ: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్య సూసైడ్

image

విజయవాడలో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అజిత్ సింగ్ నగర్‌కు చెందిన నాగరాజు ప్రసాదంపాడులో వంట మాస్టర్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం బీఆర్టీఎస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న నాగనాజు భార్య ఉష ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News October 8, 2024

విజయవాడ: 16 మంది వైసీపీ అభ్యర్థులు ఏమయ్యారు?

image

విజయవాడ పార్టీ కార్యాలయంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు YCP నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని తెలిపారు. కానీ వరదల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన 16 మంది అభ్యర్థులు ఏమైపోయారో తెలియదన్నారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న సింగ్ నగర్, జక్కంపూడి ప్రాంతాల్లో కూడా వైసీపీ నాయకులు పర్యటించలేదని విమర్శించారు.

News October 8, 2024

విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం

image

విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ఆగి ఉన్న ట్రక్కును వీరి బస్సు ఢీకొనగా.. ఒకరు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 11మంది గాయపడ్డారు. తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఘటన జరగ్గా.. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విజయవాడ నుంచి 80మంది స్టడీ టూర్ కోసం వెళ్లినట్లు సమాచారం.