News February 28, 2025
కృష్ణా విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్‌గా ఆచార్య ఉష

కృష్ణా విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్‌గా ఆచార్య ఎన్. ఉష నియమితులయ్యారు. ఇప్పటి వరకు రిజిస్ట్రార్‌గా పని చేసిన ఆచార్య కె శోభన్ బాబు డిప్యూటేషన్‌పై రాగా ఆయన పదవీ కాలం పూర్తి కావడంతో ఈ నియామకం జరిగింది. శుక్రవారం ఉష బాధ్యతలు స్వీకరించారు. ఆచార్య ఎంవి బసవేశ్వర్ రావు, పలువురు ఆచార్యులు, సహాయ ఆచార్యులు ఆమెను అభినందించారు.
Similar News
News November 29, 2025
కృష్ణా: NMMS పరీక్షల హాల్ టికెట్లపై Update

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ (NMMS) పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల సహాయ సంచాలకులు కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.inలో పొందుపరిచినట్లు DEO రామారావు తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ U-DISE కోడ్ ద్వారా లాగిన్ అయి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేయాలని ఆయన సూచించారు.
News November 28, 2025
స్వమిత్వా సర్వేను వేగవంతం చేయండి: కలెక్టర్

జిల్లాలో స్వమిత్వా సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి స్వమిత్వా సర్వే కార్యక్రమంపై సంబంధిత జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి, గ్రామాల వారీగా పురోగతిని సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 250 గ్రామాలకు గాను 210 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిందన్నారు.
News November 28, 2025
కృష్ణా జిల్లాకు దిత్వా తుఫాన్ హెచ్చరిక.!

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా కృష్ణా జిల్లాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్‌కు, దిత్వా తుఫాన్‌కు కొంత తేడా ఉంటుందని, మొంథా తుఫాన్ కారణంగా వీచిన ఈదురు గాలులు దిత్వా తుఫాన్ కారణంగా ఉండవన్నారు. కేవలం అధిక వర్షపాతం మాత్రమే నమోదవుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


