News March 30, 2024
కృష్ణా: వృద్ధ దందపతుల ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
కుటుంబ వివాదాలతో ఇంటి నుంచి బయటకు వచ్చి ఆత్మహత్యాయత్నానికి యత్నించిన వృద్ధ దందపతులను వీరవల్లి పోలీసులు కాపాడారు. పోలీసులు వివరాల మేరకు ప.గో నరసాపురానికి చెందిన వృద్ధ దంపతులు గురువారం అర్థరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. తన కుమారుడు SP అస్మీకి ఫోన్ చేసి వివరించాడు. రంగంలోకి దిగిన స్పెషల్ బ్రాంచ్ CIరమణ, SIచిరంజీవిలు కృష్ణా నదిలో దూకబోతున్న వారిని గుర్తించి స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు.
Similar News
News January 24, 2025
విజయవాడలో విదేశీ సిగరెట్లు స్వాధీనం
రామవరపాడులో గుట్టు చప్పుడు కాకుండా నిలువచేస్తున్న విదేశీ సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్, గుంటూరు జీఎస్టీ అధికారుల వివరాల మేరకు.. రామవరపాడులో విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ సిగరెట్ బాక్స్‌పై ఎటువంటి నియమ నిబంధనలు లేవని చెప్పారు. వాటి విలువ సుమారు రూ.1.76కోట్లు ఉంటుందన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా 2 వారాలు రిమాండ్ విధించారు.
News January 24, 2025
కృష్ణా: బీపీఈడీ&డీపీఈడీ పరీక్షల టైం టేబుల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో బీపీఈడీ&డీపీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 10, 11,12,13 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
News January 24, 2025
కృష్ణా: హోంగార్డులకు స్టడీ మెటీరియల్ అందించిన ఎస్పీ
కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్‌పోర్ట్ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు హోంగార్డులు ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ఎంపికలో భాగంగా ఫిజికల్ టెస్టులు పాసయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్పీ గంగాధర్ గురువారం వారిని మచిలీపట్నంలోని తన కార్యాలయంలో అభినందించారు. అనంతరం వారందరికీ మెయిన్స్ పరీక్షకు కావలసిన స్టడీ మెటీరియల్ పుస్తకాలను ఆయన అందజేశారు.