News June 21, 2024
కృష్ణా: శాసనసభకు ఎవరెవరు ఎన్నోసారంటే..!
➤ సీనియర్లు: మండలి బుద్ధప్రసాద్(4వసారి)
➤ పార్థసారథి(4వసారి)
➤ గద్దె రామ్మోహన్(4వసారి)
➤ శ్రీరామ్ తాతయ్య(3వసారి)
➤బోడె ప్రసాద్(2వసారి)
➤ బొండా ఉమ(2వసారి)
➤ వసంత కృష్ణప్రసాద్(2వసారి)
➤తంగిరాల సౌమ్య(2వసారి)
➤కొల్లు రవీంద్ర(2వసారి)
➤కామినేని శ్రీనివాస్(2వసారి)
➤ తొలిసారి: వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, కొలికపూడి శ్రీనివాస్, సుజనా చౌదరి, వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు.
Similar News
News November 28, 2024
కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో జ్యోతిరావు పూలే వర్ధంతి
మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో గురువారం మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ డీకే బాలాజీ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల సముద్దరణకు ఆయన చూపిన మార్గం అనుసరణీయమన్నారు.
News November 28, 2024
కృష్ణా: ‘ఈనెల 30వరకు ఆ పని చేయకండి’
నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు గరిష్ఠంగా 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నెల 30 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని APSDMA హెచ్చరించింది. వాయుగుండం ప్రభావం ఉన్నందున జిల్లా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
News November 28, 2024
నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న మంత్రి నాదెండ్ల
మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి పర్యటన పామర్రులో ప్రారంభమై పెడన నియోజకవర్గంలోని గూడూరు, పెడన, బంటుమిల్లి మీదగా కృత్తివెన్ను చేరనుంది. పర్యటన సందర్భంగా జిల్లాలోని పలువురు రైతులను కలసి వారి వ్యవసాయ సమస్యలు తెలుసుకోనున్నారు. అనంతరం పలు వ్యవసాయ శాఖ కార్యాలయాలను సందర్శించునున్నారు.