News February 26, 2025
కృష్ణా: శివరాత్రి ఉత్సవాలు.. ట్రాఫిక్ మళ్లింపు

ఐలూరులో శివరాత్రి ఉత్సవాలు సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నామని సీఐ చిట్టిబాబు తెలిపారు. విజయవాడ – అవనిగడ్డ వైపు వెళ్ళే వాహనాలు తోట్లవల్లూరు, ఉయ్యూరు మంటాడ, కృష్ణాపురం మీదిగా అవనిగడ్డ వెళ్లాలన్నారు. అవనిగడ్డ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలు లంకపల్లి-కృష్ణాపురం, ఉయ్యూరు, తోట్లవల్లూరు మీదుగా విజయవాడ మళ్లిస్తున్నామన్నారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.
Similar News
News February 26, 2025
MTM: ప్రారంభమైన పోలింగ్ మెటీరియల్ పంపిణీ

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రారంభమైంది. స్థానిక నోబుల్ కాలేజ్‌లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ని ఏర్పాటు చేయగా పోలింగ్ కేంద్రాల వారీగా మెటీరియల్ పంపిణీని అధికారులు ప్రారంభించారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
News February 26, 2025
కృష్ణా జిల్లా ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు: ఎస్పీ

కృష్ణా జిల్లా ప్రజలందరికీ, పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ఆర్. గంగాధర రావు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణాజిల్లా పోలీస్ శాఖ తరఫున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులందరి సమక్షంలో సంతోషం జరుపుకోవాలని ఆయన కోరుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
News February 26, 2025
గుడివాడ: డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్‌కు తీసుకున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ చేరేలా చూడాలన్నారు.