News August 30, 2024
కృష్ణా: సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున వర్సిటీ(ANUCDE)లో డిస్టెన్స్ విధానంలో UG, PG కోర్సులు చదివే విద్యార్థులు(A-21, A-22, A-23& C-21, C-22,C-23 బ్యాచ్‌లు) రాయాల్సిన 1వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడులైంది. ఈ పరీక్షలు సెప్టెంబర్ 27 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు పరీక్ష ఫీజును అపరాధ రుసుము లేకుండా సెప్టెంబర్ 2లోపు చెల్లించాలని వర్సిటీ సూచించింది. వివరాలకు http://anucde.info/అధికారిక వెబ్‌సైట్ చూడాలంది.
Similar News
News February 24, 2026
28న గన్నవరంలో జాబ్ మేళా

ఈనెల 28న ఉదయం 9 గంటలకు గన్నవరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే వెంకటరావు సోమవారం తెలిపారు. SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీ టెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. 18-35 ఏళ్ల వయసున్నవారు పాల్గొనవచ్చన్నారు. ఈ మేళాలో ప్రముఖ సంస్థలు పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు.
News February 24, 2026
ప్రజల అర్జీలకు అధిక ప్రాధాన్యత: కలెక్టర్

ప్రజల నుంచి అందే అర్జీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్నంలో జాయింట్ కలెక్టర్ నవీన్‌తో కలిసి ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల గ్రీవెన్స్‌డే నిర్వహించి వివిధ శాఖల ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం మీ-కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు.