News September 28, 2024
కృష్ణా: సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున వర్సిటీ పరిధిలోని కాలేజీలలో ఎం-ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ థియరీ పరీక్షల (సప్లిమెంటరీ) టైం టేబుల్ విడుదలైంది. అక్టోబర్ 18, 21, 23, 25 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
Similar News
News October 5, 2024
APTDC ఛైర్మన్‌గా నేడు బాధ్యతలు స్వీకరించనున్న నూకసాని
ఏపీ టూరిజం డెవలప్మెంట్ ఛైర్మన్‌గా డా.నూకసాని బాలాజీ శనివారం బాధ్యతలు చేపట్టనున్నారు. విజయవాడ ఆటోనగర్‌లోని APTDC కార్యాలయంలో ఉదయం 10.50 గంటలకు APTDC ఛైర్మన్‌గా నూకసాని బాధ్యతలు స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌తోపాటు NDA కూటమి పక్షాల నేతలు పాల్గొంటారని పేర్కొన్నాయి.
News October 4, 2024
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌గా రవినాయుడు బాధ్యతలు
ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌గా అనిమిని రవి నాయుడు బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ క్రీడా ప్రాంగణ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతతో ముందుకు సాగుతానని తెలిపారు. తనతోపాటు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్నతలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఈ స్థాయికి ప్రోత్సహించి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
News October 4, 2024
కోడూరు: కనకదుర్గమ్మకు వెండి కవచం బహుకరణ
కోడూరు మండలం నరసింహపురం రోడ్డులో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి వెండి కవచాన్ని బహుకరించారు. శుక్రవారం కోడూరు గ్రామానికి చెందిన పోతన ప్రసాద్ కుంటుంబ సభ్యులు రూ.1,01,116 విలువగల వెండి కవచం, చీర, సారే అమ్మవారికి బహుకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ ఛైర్మన్ రాంబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి కవచాన్ని అలంకరించారు.