News October 21, 2024
కృష్ణా: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు

ANUలోని సైన్స్ కళాశాలలో ఎమ్మెస్సీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ (వాటర్, ఎనర్జీ, ఆయిల్, గ్యాస్) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశాల విభాగం సంచాలకులు బ్రహ్మాజీ తెలిపారు. పరిమిత సీట్లు ఉన్నాయని, ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. బీఎస్సీ, బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, రూ.20వేలు ఫీజు చెల్లించి కోర్సులో చేరాలన్నారు.
Similar News
News December 11, 2025
కృష్ణా జిల్లా కలెక్టర్, మంత్రికి సీఎం ఇచ్చిన ర్యాంకు ఎంతంటే..!

సీఎం చంద్రబాబు కలెక్టర్ల పనితీరుపై ర్యాంకులు ప్రకటించారు. గత 3 నెలలకు సంబంధించిన నివేదికలో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఫస్ట్ ర్యాంకు సాధించారు. కలెక్టర్ 1,482 ఫైళ్లు స్వీకరించగా, 1,469 ఫైళ్లను వేగంగా పరిష్కరించారు. సగటు స్పందన సమయం 14 గంటలు 42 నిమిషాలు. డిజిటల్ పాలనలో కృష్ణా జిల్లా ఆదర్శంగా నిలిచింది. అదే విధంగా సీఎం మంత్రుల ర్యాంకులను ప్రకటించగా మంత్రి కొల్లు రవీంద్ర 24వ స్థానంలో నిలిచారు.
News December 11, 2025
కృష్ణా జిల్లా కలెక్టర్‌కు మెుదటి ర్యాంక్

జిల్లాల కలెక్టర్ల పనితీరుపై రూపొందించిన ఈ-ఫైల్ డిస్‌పోజల్ రిపోర్ట్ (గత 3 నెలల)లో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే తొలి ర్యాంకు సాధించింది. కలెక్టర్ బాలాజీ సారథ్యంలో సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 9, 2025 వరకు 1,482 ఫైళ్లు స్వీకరించగా, 1,469 ఫైళ్లను వేగంగా పరిష్కరించారు. సగటు స్పందన సమయం 14 గంటలు 42 నిమిషాలే.. డిజిటల్ పాలనలో కృష్ణా జిల్లా ఆదర్శంగా నిలిచింది.
News December 10, 2025
గన్నవరం: ఇసుక కుప్ప కాదండి.. రంగు మారిన ధాన్యం..!

పై ఫోటోలో మీకు కనిపిస్తున్నది ఇసుక కుప్ప అనుకుంటున్నారు కదూ. కానే కాదు.. అది రంగు మారిన ధాన్యం రాశి. గత మొంథా తుఫాను వరదలో నానిన వరి చేను నూర్చారు. గన్నవరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఇలా రంగు మారిన ధాన్యం రాశులు చూడొచ్చు. రైతులు 75 కిలోల బస్తా రూ.1300 చొప్పున వ్యాపారికి బుధవారం విక్రయించారు. ఈ విధంగా బస్తాకు వెయ్యి రూపాయలు చొప్పున రైతులకు నష్టాలు మిగిల్చింది తుఫాను.


