News January 24, 2025
కృష్ణా: హోంగార్డులకు స్టడీ మెటీరియల్ అందించిన ఎస్పీ
కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు హోంగార్డులు ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ఎంపికలో భాగంగా ఫిజికల్ టెస్టులు పాసయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్పీ గంగాధర్ గురువారం వారిని మచిలీపట్నంలోని తన కార్యాలయంలో అభినందించారు. అనంతరం వారందరికీ మెయిన్స్ పరీక్షకు కావలసిన స్టడీ మెటీరియల్ పుస్తకాలను ఆయన అందజేశారు.
Similar News
News January 24, 2025
కోడూరు: అంగన్వాడీ సెంటర్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
కలెక్టర్ డీకే. బాలాజీ కోడూరు మండల పర్యటనలో భాగంగా శుక్రవారం ఉల్లిపాలెం అంగన్వాడీ సెంటర్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పిల్లల అటెండెన్స్, వంటశాల, మంచి నీటి వసతి, గ్రోత్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ స్వయంగా పిల్లల వెయిట్ను పరిశీలించారు. రిజిస్టర్లో చూపించిన రేగులర్ పేర్ల పిల్లలు లేకుండా అంగన్వాడీలో వేరే పిల్లలు ఉండటంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
News January 24, 2025
మచిలీపట్నం: పలు డివిజన్లలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. 45,46 డివిజన్లలో పర్యటించిన ఆయన ఆయా వార్డుల్లో చెత్త సేకరణను పరిశీలించారు. 46వ డివిజన్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట కమిషనర్ బాపిరాజు, తదితరులు ఉన్నారు.
News January 24, 2025
విజయవాడలో విదేశీ సిగరెట్లు స్వాధీనం
రామవరపాడులో గుట్టు చప్పుడు కాకుండా నిలువచేస్తున్న విదేశీ సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్, గుంటూరు జీఎస్టీ అధికారుల వివరాల మేరకు.. రామవరపాడులో విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ సిగరెట్ బాక్స్పై ఎటువంటి నియమ నిబంధనలు లేవని చెప్పారు. వాటి విలువ సుమారు రూ.1.76కోట్లు ఉంటుందన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా 2 వారాలు రిమాండ్ విధించారు.