News July 29, 2024
కృష్ణా: ‘1వ తేదీనే పింఛన్ల పంపిణీ పూర్తవ్వాలి’
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆగస్ట్ 1వ తేదీనే పింఛన్లు 100% పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం ఉద్యోగులను ఆదేశించింది. కృష్ణా జిల్లాలో 2,42,321, ఎన్టీఆర్ 2,35,477 మందికి గత నెలలో పింఛన్ అందజేశారు. ఆగస్ట్ నెలలో ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50-100 మంది లబ్ధిదారులు ఉండేలా సంబంధిత అధికారులు మ్యాపింగ్ చేస్తున్నారు.
Similar News
News October 14, 2024
విజయవాడలో 16న వాలీబాల్ జట్ల ఎంపికలు
స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో అక్టోబర్ 16న వాలీబాల్ జట్ల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీను, ఎస్.శ్రీనివాస్‌లు తెలిపారు. ఈ ఎంపికలు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14, 17 బాలురకు మాత్రమే జరుగుతాయన్నారు. జిల్లాలో ఆసక్తి గల బాలురు ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్జీఎఫ్ ఎంట్రీ ఫామ్‌తో హాజరుకావాలన్నారు.
News October 13, 2024
విజయవాడలో సందడి చేసిన ‘మిస్టర్ బచ్చన్’ హీరోయిన్
విజయవాడలో ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే సందడి చేశారు. ఓ నగల దుకాణ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. షోరూమ్‌ను విజయవాడ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని భాగ్యశ్రీ అన్నారు. దీంతో ఆమెను చూడటానికి ప్రజలు భారీగా ఎగబడ్డారు.
News October 13, 2024
నేడు మీ కోసం కార్యక్రమం రద్దు: కలెక్టర్
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో అన్ని శాఖలకు చెందిన అధికారులు విధులలో ఉన్నందున ఈ నెల14వ తేదీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సృజన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించి జిల్లా కేంద్రానికి రావద్దని కలెక్టర్ చెప్పారు.