News March 17, 2025

కృష్ణా: 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

image

10వ తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల చుట్టు పక్కల 100 మీటర్ల పరిసర ప్రాంతాల్లో నెట్, జిరాక్స్ సెంటర్లు, ఇతర ఏ విధమైన షాపులు తెరవడానికి వీలు లేదన్నారు. 

Similar News

News December 2, 2025

క్రమబద్దీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

పట్టణ ప్రాంతాలలో అనధికార లే అవుట్లు, ఆక్రమణలను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో ఆయన మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు. అనధికార ఆక్రమణలను లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మార్చి వరకు గడువు ఇచ్చిందన్నారు. ఈ లోపు అక్రమ కట్టడాలను క్రమబద్దీకరించుకోవాలన్నారు.

News December 2, 2025

మచిలీపట్నం లేదా పెడన నుంచి పోటీకి రెడీ..!

image

జనసేన నాయకుడు కొరియర్ శ్రీను టీవీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే తాను మచిలీపట్నం లేదా పెడన నుంచి ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమని ఆయన ప్రకటించారు. దీంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో టికెట్ సమీకరణపై ప్రభావం చూపుతుందనే చర్చ జనసేన వర్గాల్లో నడుస్తోంది.

News December 2, 2025

కృష్ణా: అదుపుతప్పిన ఆటో.. డ్రైవర్ మృతి

image

పమిడిముక్కల మండలం రెడ్డిపాలెం రామాలయం చెరువు వద్ద మంటాడ నుంచి వీరంకిలాకు వెళుతున్న ఆటో అదుపు తప్పి సిగ్నల్ స్తంభాన్ని ఢీకొని చెరువులో పడిపోయింది. డ్రైవర్ దేశి నాగరాజు (50) స్పాట్‌లో‌నే మృతి చెందాడు. మహిళా ప్రయాణికులను స్థానికులు రక్షించి ఉయ్యూరు ఆసుపత్రికి తరలించారు.