News March 17, 2025
కృష్ణా: 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

10వ తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల చుట్టు పక్కల 100 మీటర్ల పరిసర ప్రాంతాల్లో నెట్, జిరాక్స్ సెంటర్లు, ఇతర ఏ విధమైన షాపులు తెరవడానికి వీలు లేదన్నారు.
Similar News
News April 18, 2025
గుణదలలో షూటింగ్ బాల్ జిల్లా జట్ల ఎంపికలు

కృష్ణాజిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాల బాలికల షూటింగ్ బాల్ జిల్లా జట్ల ఎంపికలు ఏప్రిల్ 21న గుణదలలో నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి గోగులమూడి విజయ్ కుమార్ తెలిపారు. ఈ పోటీలకు ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్ జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని కోరారు. ఇక్కడ ఎంపికైన వారు మదనపల్లిలో ఈనెల 25, 26 తేదీలలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.
News April 18, 2025
కృష్ణా: విద్యార్థి మృతదేహం లభ్యం

ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామానికి చెందిన విద్యార్థి ప్రత్తిపాటి పవన్ సమిత్ (15) గురువారం సాయంత్రం కేఈబీ కెనాల్‌లో స్నానం చేస్తూ గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎస్ఐ కె.ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కెఈబీ కెనాల్ వెంబడి గాలింపు చర్యలు చేపట్టగా చల్లపల్లి మండలం వెలివోలు కుమ్మరిపాలెం వద్ద శుక్రవారం పవన్ మృతదేహం లభ్యమైనది. ఈ సంఘటనతో పాపవినాశనంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News April 18, 2025
బాపులపాడు: మార్కెట్‌కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరి మృతి

బాపులపాడు మండలం వేలేరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేలేరు వద్ద కారు ఢీ కొనడంతో బైక్‌పై వెళ్తున్న బాబు అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇతను తేలప్రోలులో పట్టుగూళ్ల రీలింగ్ యూనిట్‌ని నిర్వహిస్తుంటాడు. పట్టుగూళ్ల కోసం హనుమాన్ జంక్షన్ మార్కెట్‌కు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.