News March 19, 2025

కృష్ణా: 10వ తరగతి సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష ప్రశాంతం

image

10వ తరగతి పరీక్షల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం నిర్వహించిన సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. 21,504 మంది విద్యార్థులకు గాను 21,026 మంది విద్యార్థులు హాజరయ్యారు. హాజరు శాతం 97.78% నమోదైంది. 33 పరీక్షా కేంద్రాలను స్క్వాడ్ అధికారులు తనిఖీ చేయగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని డీఈఓ రామారావు తెలిపారు. 

Similar News

News March 28, 2025

తిరువూరులో వేడెక్కుతున్న రాజకీయం

image

AMC మాజీ ఛైర్మన్ రమేశ్ రెడ్డికి స్థానిక ఎంపీ మద్దతు ఉందని ఎమ్మెల్యే కొలికపూడి నిన్న ఆరోపించారు. రమేశ్‌పై పార్టీ నాయకులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఎమ్మెల్యే తెలుపగా..రూ.2 కోట్లు అడిగితే తాను ఇవ్వకపోవడంతో కొలికపూడి తనపై నిందలు వేస్తున్నారని రమేశ్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో తిరువూరులో MP Vs MLAగా వివాదం తీవ్రమవుతోంది. ఆరోపణలు చేసేవారు ఓపెన్ డిబేట్‌కి రావాలని MLA సవాల్ విసిరారు.

News March 28, 2025

VJA: యువకుడిపై దాడి.. డబ్బుతో పరార్

image

ఓ ఆటోలో ఇద్దరు వ్యక్తులు కలిసి విజయవాడ బస్టాండ్ వద్దకు వచ్చి ఓ యువకుడితో అమ్మాయి ఉందని రేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు ఉండవల్లి సమీపంలో పొలాల వద్దకు వచ్చారు. అక్కడ యువకుడి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారు. పని అయ్యాక విజయవాడలో వదిలిపెట్టాలని కోరాడు. దీంతో ఆటోకి రూ.1500ఇవ్వాలని యువకుడిపై దాడి చేసి, జేబులోని డబ్బు లాక్కెళ్లారు. యువకుడు ఫిర్యాదుకు వెళ్తే పోలీసులు మందలించి పంపారు.

News March 28, 2025

రైతులను ప్రోత్సహించండి: కలెక్టర్

image

జిల్లాలో అధికంగా వినియోగించే సన్న రకాల వరి పంటల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్ రానున్న ఖరీఫ్, రబీ సీజన్లలో పండించాల్సిన వరి పంటలపై పలు సూచనలు చేశారు. సన్న రకం వరి వంగడాల సాగుపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు.

error: Content is protected !!