News October 16, 2024

కృష్ణా: 17 నుంచి ANUలో దూరవిద్యా పరీక్షలు

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని దూర విద్యాకేంద్రంలో ఈ నెల 17 నుంచి యూజీ, పీజీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం పేర్కొన్నారు. మంగళవారం పరీక్ష కేంద్రాల చీప్ సూపరింటెండెంట్లతో రిజిస్ట్రార్ సమావేశమయ్యారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు. గతంలో మాదిరిగా అక్రమాలు జరిగితే ఉపేక్షించబోమని చెప్పారు. పరీక్షల నిర్వహణలో సూపరింటెండెంట్లు కీలకమన్నారు.

Similar News

News November 3, 2024

విజయవాడ వైసీపీ మీడియా అకౌంట్లపై 45 కేసులు

image

విజయవాడ వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ఖాతాలపై ఆదివారం పోలీసులు 45 కేసులు నమోదు చేశారు. చింతాప్రదీప్ రెడ్డి దర్శన్ పిఠాపురం పావలా ఏకే ఫ్యాన్ అనే సోషల్ మీడియా ఎకౌంట్లపై జనసేన, టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన మేరకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మాచవరం గుణదల పోలీస్ స్టేషన్లో వీరి అకౌంట్లపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

News November 3, 2024

విద్యార్థులకు అలర్ట్.. రేపటితో ముగియనున్న గడువు

image

కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ(Y20-Y23 బ్యాచ్‌లు), 5వ(Y20-Y22 బ్యాచ్‌లు), 7వ(Y20-Y21 బ్యాచ్‌లు) సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ థియరీ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు రేపు సోమవారంలోపు ఎలాంటి అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని KRU పరీక్షల విభాగం తెలిపింది. వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చు. 

News November 3, 2024

విజయవాడ: రెండు రైళ్లకు అదనపు జనరల్ కోచ్‌లు

image

విజయవాడ మీదుగా ప్రయాణించే విశాఖపట్నం(VSKP)- చెన్నై ఎగ్మోర్(MS) స్పెషల్ రైళ్లకు 2 అదనపు కోచ్‌‌‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.08557/08558 రైళ్లకు 1 ఏసీ 3 టైర్, ఒక స్లీపర్ కోచ్‌‌ను అదనంగా జత చేస్తున్నామన్నారు. నం.08557 VSKP- MS రైలును నవంబర్ 9,16, 23,30వ తేదీలలో, నం.08558 MS-VSKP రైలును నవంబర్ 3,10,17,24, డిసెంబర్ 1వ తేదీన ఈ అదనపు కోచ్‌లతో నడుపుతామన్నారు.