News December 7, 2024
కృష్ణా: 2 రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా హౌరా(HWH)- తిరుచిరాపల్లి(TPJ) మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లను కొద్ది రోజుల పాటు రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు నం.12663 HWH-TPJ మధ్య ప్రయాణించే రైలును ఈనెల 12,15,19న, నం.12664 TPJ-HWH రైలును ఈనెల 10,13,17న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
Similar News
News October 16, 2025
కృష్ణా: బెల్ట్ షాపుల్లో మద్యం సురక్షితమేనా.?

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సురక్ష యాప్ ద్వారా వైన్ షాపులు, బార్లలో మద్యం సీసాల స్కానింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. అయితే, బెల్ట్ షాపుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని మద్యం ప్రియులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం మద్యం విక్రయిస్తున్న ఈ బెల్ట్ షాపుల్లో అమ్ముతున్న సీసాలు అసలువో, నకిలీవో తెలుసుకునే అవకాశం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News October 16, 2025
అంగలూరులో రాష్ట్రంలో మొట్టమొదటి బాలికల పాఠశాల

గుడ్లవల్లేరు అంగలూరు గ్రామంలో చల్లపల్లి జమిందార్ జ్ఞాపకార్థంగా బాలికల పాఠశాల ప్రారంభించారు. స్వాతంత్య్రం రాక ముందు బాలికలకు విద్య దూరంగా ఉండేది. దీంతో 1946లో ఈ స్కూల్ ప్రారంభించి బాలికా విద్యకు పునాది వేశారు. జమిందారీ దాతృత్వంతో 96 సంవత్సరాల అద్భుత ప్రయణం సాగుతోంది. రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన బాలికల ప్రభుత్వ పాఠశాలగా గుర్తింపు పొందింది. ఇటీవల జిల్లాస్థాయి స్వచ్ఛ పాఠశాల అవార్డు అందుకుంది.
News October 16, 2025
గన్నవరంలో యాక్సిడెంట్.. స్పాట్ డెడ్

గన్నవరం జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ – ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో బైకుపై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బాపులపాడు మండలానికి చెందిన గరికిపాటి సుబ్బారావుగా గుర్తించారు. అతను రైల్వే శాఖలో పని చేసి రిటైర్ అయ్యారు. మార్కెట్ నుంచి సరుకులకు తీసుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.