News December 10, 2024
కృష్ణా: 2 రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా సత్రాగచ్చి(SRC)- చెన్నై సెంట్రల్(MAS) మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ AC ఎక్స్‌ప్రెస్‌లను కొద్ది రోజులపాటు రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు నం.22807 SRC- MAS మధ్య ప్రయాణించే రైలును ఈ నెల 10, 13, 17న, నం.22808 MAS- SRC రైలును ఈ నెల 12, 15, 19న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
Similar News
News December 16, 2025
మచిలీపట్నం: ‘అటల్-మోదీ’ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే.!

నేడు మచిలీపట్నం రానున్న ‘అటల్-మోదీ’ సుపరిపాలన బస్సు యాత్ర రూట్ మ్యాప్‌ను ఆ పార్టీ నేతలు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక మూడు స్థంభాల సెంటర్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. చల్లరాస్తా సెంటర్, కోనేరుసెంటర్, బస్టాండ్, లక్ష్మీటాకీస్, డీ మార్ట్ రోడ్డు మీదుగా న్యూ హౌసింగ్ బోర్డ్ సర్కిల్‌కు చేరుకుంటుంది. వాజ్ పేయి విగ్రహావిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
News December 16, 2025
పేకాట శిబిరాలకు కృష్ణా జిల్లా అడ్డాగా మారుతోందా.?

పేకాట శిబిరాలకు కృష్ణా జిల్లా వేదికగా మారుతోందా.? అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. జూద క్రీడలు రోజు రోజుకు విస్తరిస్తుండటంమే దీనికి నిదర్శనం. పేకాట వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. జిల్లా ఎస్పీ జూద శిబిరాలపై, యాంటీ డ్రగ్ నిర్మూలనపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ, కింది స్థాయి సిబ్బంది పనితీరు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News December 16, 2025
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు

కృష్ణా జిల్లా పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఆధార్ ప్రత్యేక క్యాంపులు మంగళవారం నుంచి నిర్వహించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. నవంబర్‌లో నిర్వహించిన క్యాంపుల కొనసాగింపుగా ఈ నెల 16 నుంచి 20 వరకు, అలాగే 22 నుంచి 24 వరకు క్యాంపులు జరుగుతాయని పేర్కొంది. బయోమెట్రిక్ అప్డేట్ మిగిలి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.


