News June 21, 2024

కృష్ణా: 2019, 2024లో అసెంబ్లీలో అడుగుపెట్టింది వీరే

image

ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 2019, 2024లో శాసనసభలో ముగ్గురు మాత్రమే అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన పార్థసారథి, వసంత కృష్ణప్రసాద్ ఈ సారి నూజివీడు, మైలవరం నియోజకవర్గాల టీడీపీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. 2019తో పాటు తాజా ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి టీడీపీ తరఫున గెలుపొందిన గద్దె రామ్మోహన్ మరోమారు అసెంబ్లీకి వెళ్లారు.

Similar News

News February 27, 2026

బాపులపాడు డిప్యూటీ ఎంపీడీఓపై సస్పెన్షన్ వేటు

image

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాపులపాడు మండల డిప్యూటీ ఎంపీడీఓ లక్ష్మయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. లక్ష్మయ్యను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. పన్ను వసూళ్లలో పురోగతి సాధించకపోవడం, సమీక్షా సమావేశాలకు గైర్హాజరు అవుతుండటం, OHSR ట్యాంక్‌లను పరిశుభ్రపర్చడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ ఎంపీడీఓను సస్పెండ్ చేశారు.

News February 26, 2026

నీట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

మే 3న నిర్వహించనున్న నీట్ పరీక్షల ఏర్పాట్లపై న్యూఢిల్లీ నుంచి NTA డైరెక్టర్ జనరల్ రాజేష్ లఖని, రాష్ట్ర విద్యా కమిషనర్ భరత్ గుప్తాతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణాజిల్లా కలెక్టర్ DK బాలాజీ పాల్గొన్నారు. జిల్లాలో పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కేంద్రాల వద్ద మౌలిక వసతులు, భద్రత విషయంలో రాజీ పడకూడదని అధికారులకు స్పష్టం చేశారు.

News February 26, 2026

అక్షర ఆంధ్ర లక్ష్యంగా ‘ఉల్లాస్-02’ అమలుకు కలెక్టర్ ఆదేశం

image

విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పాల్గొన్నారు. 100 శాతం అక్షరాస్యత సాధనకు కేంద్రం తెచ్చిన ‘ఉల్లాస్-02: అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిరక్షరాస్యత నిర్మూలనకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.