News June 26, 2024

కృష్ణా: 233 కి.మీ. మేర పూర్తైన 3వ రైల్వే లైన్ పనులు

image

విజయవాడ-గూడూరు మధ్య నిర్మిస్తున్న 3వ రైల్వే లైన్ పనులు 233 కి.మీ. మేర పూర్తయ్యాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 288 కి.మీ. మేర నిర్మిస్తున్న ఈ లైన్‌లో పలు చోట్ల వంతెనలు నిర్మించామని రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ లైన్ పనులు పూర్తై అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో వాణిజ్యం ఊపందుకోవడంతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలతో మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.

Similar News

News November 18, 2025

కృష్ణా జిల్లాలో ఏడుగురు ఎస్ఐల బదిలీ

image

జిల్లాలో ఏడుగురు ఎస్ఐలు బదిలీ అయ్యారు. VRలో ఉన్న కెవై దాస్‌ను చల్లపల్లి SIగా, నాగ శివనాధ్‌ను DCRB SIగా బదిలీ చేశారు. చల్లపల్లి SI PSV సుబ్రహ్మణ్యం ఇనగుదురు SI-1గా, కోడూరు SI శిరీషను కూచిపూడి SIగా, ఇనగుదురు SI-1 YVV సత్యనారాయణను DTC పెదవేగి ఏలూరు జిల్లాకు, గుడివాడ వన్ టౌన్ SI గౌతమ్ ను అవనిగడ్డ SI-2గా బదిలీ చేస్తూ SP విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.

News November 18, 2025

మంగళగిరి: భార్యని హత్య చేసిన భర్త

image

గుంటూరు(D) మంగళగిరి పరిధి యర్రబాలెంలో వివాహిత హత్యకు గురైంది. CI బ్రహ్మం, SI వెంకట్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. వారి వివరాల మేరకు.. మచిలీపట్నంకు చెందిన కిలిమి లక్ష్మీ(29) ఐదేళ్ల క్రితం శంకర్ రెడ్డిని పెళ్ళి చేసుకుంది. కలహాలతో విడిపోయి, చినకాకానికి చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తూ యర్రబాలెంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో భర్త శంకరరెడ్డి గొంతునులిమి హత్యచేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

News November 18, 2025

మచిలీపట్నంలో మరో ప్రాజెక్ట్‌కు ఒప్పందం

image

మచిలీపట్నంకు మరో భారీ ప్రాజెక్ట్ రానుంది. రూ.6500 కోట్లతో గోవా షిప్ యార్డ్ నిర్మాణం జరగనుంది. ఇటీవల విశాఖలో జరిగిన CII సదస్సులో గోవా షిప్ యార్డ్ సంస్థ ప్రభుత్వంతో MOU చేసుకుంది. గోవా షిప్ యార్డ్ నిర్మాణం ద్వారా 6వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మచిలీపట్నంలో ఇప్పటికే పోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గోవా షిప్ యార్డ్ నిర్మాణం కూడా జరిగితే ఈ ప్రాంతానికి మహర్దశ పట్టినట్టే.