News March 10, 2025
కృష్ణా: 45వేల మందికి ఉద్యోగ అవకాశాలు

మల్లవల్లి పారిశ్రామిక వాడలో 405 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు భారీగా రానున్నాయి. ప్రత్యక్షంగా 30వేల మందికి, పరోక్షంగా 15వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మొత్తం 45వేల మందికి ఉద్యోగ అవకాశాలు త్వరలో రానున్నాయి. ఒకప్పుడు పల్లెటూరిగా ఉన్న మల్లవల్లి ఇప్పుడు వేగంగా ఓ పట్టణంగా మారబోతుంది.
Similar News
News March 17, 2025
కృష్ణా: 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

10వ తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల చుట్టు పక్కల 100 మీటర్ల పరిసర ప్రాంతాల్లో నెట్, జిరాక్స్ సెంటర్లు, ఇతర ఏ విధమైన షాపులు తెరవడానికి వీలు లేదన్నారు.
News March 17, 2025
కృష్ణా జిల్లాలో పది పరీక్షలకు సర్వం సిద్ధం

నేటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లను విద్యాశాఖాధికారులు పూర్తిచేశారు. జిల్లాలో మొత్తం 145 కేంద్రాల్లో పరీక్షలు జరగనుండగా 22,341 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పరీక్షా కేంద్రాల్లో చేపట్టారు. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా 52 సిట్టింగ్, 05 ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు.
News March 17, 2025
కృష్ణా: ‘టెన్త్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్’

నేడు జరగబోయే పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మంత్రి కొల్లు రవీంద్ర ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా పరీక్షలు రాయాలన్నారు. సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఎండలకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడే ఫలితాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.