News May 10, 2024

కృష్ణా: 50% పైబడి ఓట్లు సాధించింది వీరే..

image

2019 ఎన్నికలలో ఉమ్మడి కృష్ణాలోని పలు స్థానాల్లో పోలైన ఓట్లలో 50% పైబడి ఓట్లు సాధించిన పలువురు నేతలు ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిపత్యం చెలాయించారు. కొడాలి నాని (గుడివాడ)- 53.5% రక్షణనిధి (తిరువూరు)- 50.73%, ఎం.అప్పారావు(నూజివీడు)- 50.84%, కైలే అనిల్(పామర్రు)- 56.15%, మొండితోక జగన్(నందిగామ)- 51.32% ఓట్లు సాధించారు. కాగా, వీరిలో కొడాలికి జగన్ కేబినెట్‌గా పౌరసరఫరాల శాఖ మంత్రిగా చోటు దక్కింది.

Similar News

News April 19, 2026

కృష్ణా: Way2Newsలో ఉద్యోగ అవకాశాలు

image

కృష్ణా జిల్లాలో మండలాల వారీగా Way2Newsలో పని చేయడానికి రిపోర్టర్‌లు కావలెను. అర్హత: ఏదైనా ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన, చేసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి గల వారు <>ఈ లింక్‌ను క్లిక్ చేసి చేసి<<>> వివరాలు నమోదు చేయండి. త్వరలో మా టీమ్ మిమ్మల్ని సంప్రదిస్తుంది.

News April 19, 2026

కృష్ణా: రేపు కలెక్టరేట్‌లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్

image

జిల్లాలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గాను ఈ నెల 20వ తేదీన కలెక్టరేట్‌లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ మీటింగ్ హాలులో ప్రారంభమయ్యే గ్రీవెన్స్‌లో ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

News April 19, 2026

మచిలీపట్నంలో నేడు బంగారం ధర ఎంతంటే!

image

అక్షయ తృతీయ కావడంతో జిల్లా కేంద్రంమైన మచిలీపట్నంలోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. మచిలీపట్నంలో ఆదివారం గ్రాము బంగారం రూ. 15,078 పలుకుతోంది. 10 గ్రాములు రూ. 1,50,780 చొప్పున విక్రయిస్తున్నారు. వెండి గ్రాము రూ.280గా ఉంది. అక్షయ తృతీయలో కనీసం గ్రాము బంగారమైనా కొనాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు.