News August 29, 2024

కృష్ణా: APEDBలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డులో 13 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్(2), జనరల్ మేనేజర్(5), మేనేజర్(6) పోస్టులున్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 11లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు https://apedb.ap.gov.in/career.html అధికారిక వెబ్‌సైట్ చూడాలని సంబంధిత వర్గాలు సూచించాయి.

Similar News

News October 25, 2025

వర్షాలకు జిల్లాలో 316 హెక్టార్ల వరి పంట నష్టం

image

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కృష్ణా జిల్లాలో పంట నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ అధికారులు సేకరించిన అంచనా వివరాల ప్రకారం జిల్లాలో మొత్తం 316 హెక్టార్లలో వరి పంటలు దెబ్బతిన్నాయి. మచిలీపట్నం మండలంలో 33.6 హెక్టార్లు, పెడన మండలంలో 101 హెక్టార్లు, గూడూరు మండలంలో 20 హెక్టార్లు, కంకిపాడు మండలంలో 17 హెక్టార్లు, తోట్లవల్లూరు మండలంలో 8 హెక్టార్లలో వరి పంట నష్టపోయినట్లు అధికారులు పేర్కన్నారు

News October 25, 2025

నేడు కలెక్టరేట్‌లో వాహనాలకు నిషేధం

image

శబ్ద, వాయు కాలుష్య నివారణలో భాగంగా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 25వ తేదీ శనివారం రోజున వాహనాలపై నిషేధం విధించారు. కలెక్టరేట్‌లో పనిచేసే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా కాలినడకన లేదా సైకిల్‌పై విధులకు హాజరు కావాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. ఆ రోజు కలెక్టరేట్ ప్రాంగణంలో ఎటువంటి మోటారు వాహనాలకు ప్రవేశం ఉండదని ఆయన స్పష్టం చేశారు.

News October 24, 2025

కృష్ణా జిల్లాలో వర్షపాతం వివరాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 46.2 మి.మీల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అత్యధికంగా గూడూరు మండలంలో 89.2 మి.మీల వర్షపాతం నమోదు అవ్వగా అత్యల్పంగా నాగాయలంక మండలంలో 19.6మి.మీల వర్షపాతం నమోదైంది. రానున్న 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.