News August 29, 2024
కృష్ణా: APEDBలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డులో 13 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్(2), జనరల్ మేనేజర్(5), మేనేజర్(6) పోస్టులున్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 11లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు https://apedb.ap.gov.in/career.html అధికారిక వెబ్‌సైట్ చూడాలని సంబంధిత వర్గాలు సూచించాయి.
Similar News
News September 11, 2024
24న కృష్ణా జిల్లా మత్స్య సహకార సంఘం ఎన్నికలు
కృష్ణా జిల్లా మత్స్య సహకార సంఘం నూతన పాలకవర్గం ఎన్నికకు సంబంధించి కలెక్టర్ డీకే బాలాజీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 24న ఎన్నికలు నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 17వ తేదీన నామినేషన్ల స్వీకరణ, 18న పరిశీలన, 19న ఉపసంహరణకు గడువు ఇచ్చారు. 24వ తేదీ ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందన్నారు.
News September 11, 2024
విజయవాడలో ‘ఉరుకు పటేల’ చిత్ర యూనిట్ సందడి
‘ఉరుకు పటేల’ చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది. ఈ నెల 7న చిత్రం విడుదలై థియేటర్‌లలో విజయవంతంగా నడుస్తోందని ఆ సినిమా హీరోహీరోయిన్లు తేజస్ కంచర్ల, కుష్బూ చౌదరి తెలిపారు. మూవీ విజయోత్సవం సందర్భంగా విజయవాడ వచ్చిన యూనిట్ నగరంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడిని మంగళవారం రాత్రి దర్శించుకొని పూజలు చేశారు. తమ చిత్రం వినాయకచవితి రోజున విడుదల అయ్యిందని, ఆ గణపయ్య ఆశీస్సులతో మంచి సక్సెస్ సాధించిందన్నారు.
News September 11, 2024
విజయవాడ: పాడైన విద్యుత్ మీటర్ల స్థానంలో కొత్తవి..
విజయవాడలో వరదల కారణంగా విద్యుత్ శాఖకు కూడా బాగానే నష్టం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్, సెల్లర్లో ఉన్న విద్యుత్ మీటర్లు వరద నీటికి పాడయ్యాయి. పాడైన మీటర్ల స్థానంలో తాత్కాలికంగా కొత్త మీటర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 35 వేల మీటర్లను సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. నేటి నుంచి మీటర్లు పాడైన స్థానంలో కొత్త మీటర్లను ఉచితంగా ఏర్పాటు చేయనున్నారు.