News March 19, 2024

కృష్ణా: APSDMA అధికారుల ముఖ్య విజ్ఞప్తి

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద ఉండవద్దని ఆయన సూచించారు. పిడుగులు పడే సమయంలో సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు.

Similar News

News February 6, 2025

ఫైళ్ల క్లియరెన్స్.. కొల్లు రవీంద్రకు 12వ ర్యాంకు

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో కృష్ణా జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర 12వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.

News February 6, 2025

ఉంగుటూరు: ఎలుకల మందు తాగిన వ్యక్తి.?

image

ఎలుకల మందు తాగి వ్యక్తి చనిపోయిన ఘటన ఉంగుటూరు మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మానికొండకు చెందిన షేక్ మునీర్ మద్యానికి బానిసై ఎలుకల మందు వాటర్‌లో మిక్స్ చేసి తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బెజవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 

News February 6, 2025

ఉయ్యూరు వీరమ్మ తల్లి @ 500 ఏళ్ల చరిత్ర 

image

500 ఏళ్ల చరిత్ర గల వీరమ్మ తల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పెదకడియం గ్రామంలో జన్మించి భర్త చింతయ్య హత్యకు గురికావడంతో సతీసహగమనం చేసింది. భర్త హత్యకు కారణమైన కరణం సుబ్బయ్య వంశం నిర్విర్యమైంది. ఉయ్యూరులో ఆమెకు ఆలయం నిర్మించి, ఏటా మాఘ శుద్ధ ఏకాదశి నుంచి 15 రోజుల పాటు తిరునాళ్లు నిర్వహిస్తున్నారు. ఉయ్యాల ఊయింపు ప్రత్యేక సంప్రదాయం. లక్షలాది మంది భక్తులు ఈ తిరునాళ్లలో పాల్గొంటారు. 

error: Content is protected !!