News August 13, 2024
కృష్ణా: APSSDC ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ కోర్సులలో ఉచిత శిక్షణ
విజయవాడ SRR & CVR కళాశాలలో జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సులలో 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో ఇచ్చే ఈ శిక్షణకు ఇంటర్, డిగ్రీ పాసైన విద్యార్థులు ఈ నెల 19లోపు SRR కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి చెప్పారు. శిక్షణ పూర్తైన అనంతరం APSSDC సర్టిఫికెట్లు ప్రధానం చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.
Similar News
News November 26, 2024
సోషల్ మీడియాలో మంచిని మాత్రమే అనుసరించాలి: కొలుసు
యువతీ, యువకులు సోషల్ మీడియాలో మంచిని మాత్రమే అనుసరించాలని మంత్రి కొలుసు పార్ధసారధి విద్యార్థులకు సూచించారు. తాను వ్యక్తిగతంగా సోషల్ మీడియా ఫాలోకానని చాలా మంది ప్రముఖులు కూడా సోషల్ మీడియాను ఫాలో అవ్వరని చెప్పారు. సోమవారం ఎస్ఆర్ఆర్ కళాశాలలో సామాజిక మాధ్యమాల దుష్ప్రచారం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించి వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకోవచ్చని అన్నారు.
News November 26, 2024
కృష్ణా: MSC రెండో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన ఎంఎస్సీ- ఫారెస్ట్రీ, న్యూట్రిషన్ & డైటిక్స్, ఇన్స్ట్రమెంటేషన్ టెక్నాలజీ కోర్సుల 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలంది.
News November 26, 2024
కృష్ణా: నేడు అన్ని విద్యా సంస్థల్లో రాజ్యాంగ దినోత్సవం
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో భారత రాజ్యాంగ పీఠికను ఉదయం 11:30ని.లకు సామూహికంగా చదవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్ బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలను గౌరవించడం, గుర్తించడం, రాజ్యాంగాన్ని ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.