News June 30, 2024
కృష్ణా: B.A. LL.B కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని B.A.LL.B కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన ఎనిమిదవ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 24, 26, 29, 31, ఆగస్టు 2వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.
Similar News
News October 11, 2024
కైకలూరులో రికార్డ్ స్థాయిలో ధరలు.. KG రూ.400
కైకలూరులో రికార్డు స్థాయిలో వెల్లుల్లి ధర పలుకుతోంది. అటు NTR జిల్లాలో కూడా భారీగా పెరిగాయి. ఇప్పటికే ఉల్లి, టమాటాలు సెంచరీకి దగ్గరలో ఉండగా.. వాటికి వెల్లుల్లి తోడయింది. ప్రస్తుతం వెల్లుల్లి కిలో రూ.400 పలుకుతోందని వినియోగదారులు, వ్యాపారస్థులు చెబుతున్నారు. ఇప్పటికే పలు నిత్యావసర సరుకులు ప్రభుత్వం తక్కువ ధరలకు ఇచ్చే ఏర్పాట్లు చేయగా.. వాటిలో వెల్లుల్లిని చేర్చాలంటున్నారు.
News October 11, 2024
ఇంద్రకీలాద్రిపై మహిషాసుర మర్దినిగా అమ్మవారు
ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కొలిచిన వారికి కొంగుబంగారమై నిలుస్తూ భక్తుల కోరికలు నెరవేర్చే అమ్మవారిని నేడు దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేటి తెల్లవారుజాము నుంచే ఆలయ పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
News October 11, 2024
కృష్ణా: BBA పరీక్షల టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో BBA కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 23 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 24 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.