News June 17, 2024

కృష్ణా: BA.LLB కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా వర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన BA.LLB కోర్సు 5వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 24లోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.

Similar News

News October 18, 2025

కృష్ణా జిల్లాలో వర్షం.. దీపావళి వ్యాపారులకు ఆటంకం

image

దీపావళి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టపాసులు, గుండు సామాగ్రి దుకాణాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న వర్షం వ్యాపారులకు ఆటంకంగా మారింది. పండుగ సీజన్‌లో అధిక ఆదాయం ఆశించిన వ్యాపారులకు ఒకవైపు వర్షం, మరోవైపు అధికారుల అనుమతులు, భద్రతా నిబంధనల పరిమితులు కూడా పెద్ద సవాలుగా మారాయి.

News October 18, 2025

కృష్ణా: విశ్వనాథ సత్యనారాయణ వర్థంతి నేడే

image

తెలుగు సాహిత్యాన్ని ప్రపంచస్థాయికి చేర్చిన కవి సామ్రాట్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ వర్థంతి నేడు. 1895 సెప్టెంబర్ 10న ఉమ్మడి కృష్ణా (D) నందమూరులో జన్మించిన విశ్వనాథ తన అద్భుతమైన రచనలతో తెలుగు సాహిత్యంలో అజరామరుడయ్యారు. 1976 అక్టోబర్ 18న ఆయన తుదిశ్వాస విడిచినా, ఆయన సృష్టించిన ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’, ‘వేయిపడగలు’ వంటి సాహిత్య సృష్టులు తెలుగుజాతి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి.

News October 18, 2025

మచిలీపట్నం: పిచ్చి మొక్కలు తొలగించిన కలెక్టర్

image

స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం రైతు బజారు పక్కన ఉన్న పశువుల ఆస్పత్రిలో జరిగిన శ్రమదానం కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు. ఉద్యోగులతో కలిసి పశువుల ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖరరావు, తదితరులు పాల్గొన్నారు.