News October 30, 2024

కృష్ణా: LLB 9వ సెమిస్టర్ టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో అయిదేళ్ల LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 9వ సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. నవంబర్ 19, 21, 23, 25, 27వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 70 మార్కులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. పూర్తి వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చు. 

Similar News

News October 31, 2024

ప్రయాణికుల రద్దీ మేరకు తిరుపతికి ప్రత్యేక రైళ్లు 

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్(SC), తిరుపతి(TPTY) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 3 నుంచి 24 వరకు ప్రతి ఆదివారం TPTY- SC(నం.07481), నవంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి సోమవారం SC- TPTY(నం.07482) మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడతో పాటు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు. 

News October 31, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదల 

image

కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ (Y20 నుంచి Y22 బ్యాచ్‌లు) సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ థియరీ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 4లోపు ఎలాంటి అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. నవంబర్ 26 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తామని, ఫీజు వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చు. 

News October 31, 2024

బుడమేరు వరద నివారణకు డీపీఆర్ సిద్ధం చేయండి: సీఎం

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బుడమేరు వరద నివారణకు డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు బుధవారం ఆదేశించారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, కలెక్టర్ నిధి మీనా తదితర అధికారులతో సీఎం బుధవారం ఈ అంశంపై అమరావతి సచివాలయంలో సమావేశమయ్యారు. వరదల్లో నష్టపోయిన వాహనదారుల బీమా చెల్లింపులను 15 రోజుల్లో మొత్తం పూర్తి చేయాలని సీఎం ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.