News October 30, 2024
కృష్ణా: LLB 9వ సెమిస్టర్ టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో అయిదేళ్ల LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 9వ సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. నవంబర్ 19, 21, 23, 25, 27వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 70 మార్కులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. పూర్తి వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.
Similar News
News November 3, 2024
కృష్ణా: DSC అభ్యర్థులకు ALERT.. వాయిదా
DSC పరీక్షకు దరఖాస్తు చేసుకున్న SC, ST అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణకై దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్‌లైన్‌లో మొదట నవంబర్ 3న స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహించాల్సి ఉంది. దానిని 10వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని కృష్ణా జిల్లా సోషల్ వెల్ఫేర్ DD షాహిద్ బాబు చెప్పారు. స్క్రీనింగ్ టెస్ట్ వివరాలకు అభ్యర్థులు జ్ఞానభూమి వెబ్‌సైట్ చూడాలని షాహిద్ బాబు సూచించారు.
News November 3, 2024
మంచి రోజులు వచ్చాయి : మంత్రి కొలుసు
టీడీపీ పాలనతో ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు వచ్చాయని, ఇకపై మంచి రోడ్లూ వస్తాయని మంత్రి కొలుసు పార్థసారథి శనివారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.860 కోట్లతో గుంతలు పడిన రోడ్లను బాగుచేసే పనులు మొదలుపెట్టామని కొలుసు పేర్కొన్నారు. ప్రజల భద్రత, సౌకర్యమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కొలుసు ఈ మేరకు ట్వీట్ చేశారు.
News November 2, 2024
కైకలూరు: బాలికపై అత్యాచారయత్నం.. కేసు నమోదు
మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని ఆమెపై అత్యాచారయత్నం చేసిన ఘటనలో శనివారం పోక్సో కేసు నమోదుచేసి అరెస్టు చేసినట్లు కైకలూరు టౌన్ ఎస్ఐ వెంకటకుమార్ తెలిపారు. కైకలూరుకి చెందిన బాలికను, అదే గ్రామానికి చెందిన సుగుణరావు అనే వ్యక్తి మాయ మాటలు చెప్పి శారీరకంగా అనుభవించడానికి ప్రయత్నించగా బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. విషయం తెలిసిన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.