News November 12, 2024

కృష్ణా: LLM కోర్సుల అకడమిక్ క్యాలెండర్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో LLM కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన టెంటేటివ్ అకడమిక్ క్యాలెండర్ సోమవారం విడుదలైంది. ప్రతి సెమిస్టర్‌లో 90 పనిదినాలుండేలా అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించామని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. LLM కోర్సుల ఇంటర్నల్, థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో అకడమిక్ క్యాలెండర్‌ను చూడవచ్చు.

Similar News

News December 21, 2025

బందరు – ప్రయాగ్‌రాజ్‌ మధ్య ప్రత్యేక రైలు

image

పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం – ప్రయాగ్‌రాజ్ (07401) మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 22న సాయంత్రం 4:20 గంటలకి మచిలీపట్నంలో బయలుదేరి.. గుడివాడ, విజయవాడ, వరంగల్ మీదుగా మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు గమ్యస్థానం చేరుతుంది. ఇందులో ఏసీ, జనరల్, సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

News December 20, 2025

కృష్ణా: మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్ నడిపిన కలెక్టర్

image

‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’లో భాగంగా కృష్ణా కలెక్టరేట్‌లో శనివారం ‘క్లీన్ & క్లీన్’ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ వినూత్నంగా స్పందించారు. స్వయంగా మున్సిపాలిటీ చెత్త ట్రాక్టరును నడిపి, ప్రాంగణంలోని వ్యర్థాలను సేకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని కలెక్టరేట్ మూలమూలలా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు.

News December 19, 2025

DRC సమావేశాలను సీరియస్‌గా తీసుకోండి: బుద్ధప్రసాద్

image

ఎంతో ప్రాధాన్యత కలిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశం (DRC) నిర్వహణను సీరియస్‌గా తీసుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను కోరారు. శుక్రవారం సాయంత్రం సుభాష్ అధ్యక్షతన DRC సమావేశం నిర్వహించారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావల్సిన సమావేశం 4 గంటలకు ప్రారంభం కావడం పట్ల బుద్ధప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు.