News November 12, 2024
కృష్ణా: LLM కోర్సుల అకడమిక్ క్యాలెండర్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో LLM కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన టెంటేటివ్ అకడమిక్ క్యాలెండర్ సోమవారం విడుదలైంది. ప్రతి సెమిస్టర్‌లో 90 పనిదినాలుండేలా అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించామని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. LLM కోర్సుల ఇంటర్నల్, థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో అకడమిక్ క్యాలెండర్‌ను చూడవచ్చు.
Similar News
News December 13, 2024
కృష్ణా: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో SEPT 2024లో నిర్వహించిన LLB, BA.LLB 2వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు డిసెంబర్ 17లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.9,00 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపునకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
News December 12, 2024
విజయవాడ: నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే సమావేశం
తూర్పు నియోజకవర్గంలోని సమస్యలపై కార్పొరేషన్ అధికారులతో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ గురువారం సమావేశం నిర్వహించారు. విజయవాడ అశోక్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలన్నింటిని పరిష్కరించడానికి కార్పొరేషన్ పరంగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. కృష్ణా రిటైనింగ్ వాల్ సమీపంలో 80 అడుగుల రోడ్డు నిర్మాణం చేయాలని సూచించారు.
News December 12, 2024
అవంతి శ్రీనివాస్‌పై బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌పై బుద్ధా వెంకన్న Xలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వైసీపీ పాలనలో నువ్వు, జగన్ సర్వం నాకేశారని, నీకు రాజకీయ జన్మ ఇచ్చిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకే ద్రోహం చేశావు. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి నిన్ను తీసుకువెళ్లిన చంద్రబాబును అవమానించిన నీ సానుభూతి కూటమి పాలనకు అవసరం లేదు’ అని పోస్ట్ చేశారు. అనంతరం అవంతి శ్రీనివాస్, ఊసరవెల్లి ఉన్న ఫొటోను Xలో పోస్ట్ చేశారు.