News January 18, 2025
కృష్ణా: LLM పరీక్షల షెడ్యూల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో LLM కోర్సు(2024-25 విద్యా సంవత్సరం) చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ థియరీ పరీక్షలను 2025 ఫిబ్రవరి 10 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 27లోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.
Similar News
News November 17, 2025
కృష్ణా: SP కార్యాలయంలో ‘మీకోసం’.. 37 అర్జీలు దాఖలు

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో మొత్తం 37 అర్జీలు అందినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. వాటిని కూలంకషంగా పరిశీలించి, సత్వరం పరిష్కరించేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు బదిలీ చేసినట్లు, తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.

‘కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టండి’

కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలన్న డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని రాధా-రంగా మిత్ర మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు కలెక్టర్ డీకే బాలాజీని కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన రంగా పేరును జిల్లాకు పెట్టాలని పెద్ద ఎత్తున పోరాడుతున్నామన్నారు.