News January 6, 2025
కృష్ణా: MBA పరీక్షల రివైజ్డ్ టైంటేబుల్ విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736165800953_51824121-normal-WIFI.webp)
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ-ANU పరిధిలో MBA (ఇంటర్నేషనల్ బిజినెస్& ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్) విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఈనెల 22 నుంచి ఫిబ్రవరి 7 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని ANU తెలిపింది. సబ్జెక్టువారీగా టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని సూచించింది.
Similar News
News January 18, 2025
నందిగామ మండలంలో దారుణ హత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737185871202_51433206-normal-WIFI.webp)
నందిగామ మండల పరిధిలోని పల్లగిరి గ్రామ సమీపంలో సుబాబుల తోటలో షేక్ నాగుల్ మీరా అనే వ్యక్తిని కర్రలతో కొట్టి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత రాత్రి స్నేహితులతో సుబాబులు తోటలో మద్యం సేవించే క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగినట్లుగా సమాచారం. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News January 18, 2025
ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూతన డీఎస్పీలు వీరే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737176810958_51960253-normal-WIFI.webp)
ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూతనంగా పలువురు డీఎస్పీలకు పోస్టింగ్‌లు ఇస్తూ శుక్రవారం రాత్రి డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీచేశారు. విజయవాడ సౌత్ ఏసీపీగా దేవినేని పవన్ కుమార్, గుడివాడ డీఎస్పీగా ధీరజ్ వినీల్ అవనిగడ్డ డీఎస్పీగా తాళ్లూరు విద్యశ్రీ ను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని ఉత్తర్వులు పేర్కొన్నారు.
News January 18, 2025
కలిదిండి: మాజీ సర్పంచ్‌ది ప్రమాదం కాదు.. హత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737169149361_52059243-normal-WIFI.webp)
కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం సంతోషపురం మాజీ సర్పంచ్ కాలవ నల్లయ్యది ప్రమాదం కాదని హత్యేనని పోలీసులు నిర్ధారించారు. పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన బోధన శీను పథకం ప్రకారం గురువారం సాయంత్రం దాడి చేసి హతమార్చినట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. హత్య కేసుగా నమోదు చేసి నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ వివరించారు.