News August 11, 2024
కృష్ణా: MBA/MCA పరీక్షల టైంటేబుల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో MBA/MCA కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఆగస్టు 17 నుంచి 24 మధ్య ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
Similar News
News November 5, 2025
పెడన: సైబర్ క్రైమ్ కేసు.. విశాఖపట్నంకు ఆరుగురి తరలింపు

విశాఖపట్నం సైబర్ క్రైమ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించిన ఆరుగురిని అధికారులు పెడనలో అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం విశాఖపట్నానికి తరలించారు. నిందితులపై పెడన పోలీస్ స్టేషన్లో సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఈ అరెస్టులు, దర్యాప్తుతో పెడన ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
News November 4, 2025
కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలు అసంబద్ధం: YS జగన్

కృష్ణా జిల్లాలో జగన్ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా కలెక్టర్ అక్టోబర్ 30న ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఒక్క రోజులోనే సోషల్ ఆడిట్, ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. 31 తర్వాత దరఖాస్తుకు కూడా అవకాశం లేదు. ఒక్కరోజులో పంట పొలాల్లోకి వచ్చి ఎన్యూమరేషన్ చేయటం అసాధ్యం అని జగన్ విమర్శించారు. అసలు ఎన్యూమరేషన్ అంటే చంద్రబాబుకు తెలుసో లేదో తెలుసుకోవాలని ఆయన ప్రశ్నించారు.
News November 4, 2025
జగన్ కాన్వాయ్‌ను అనుసరిస్తుండగా బైక్ ప్రమాదం

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా ప్రమాదం జరిగింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్న జగన్ కాన్వాయ్‌ను బైక్‌పై అనుసరిస్తున్న ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. పామర్రు మండలం కనుమూరు గ్రామ పరిధిలోని రొయ్యల ఫ్యాక్టరీ వద్ద అదుపుతప్పి పడిపోవడంతో ఆ ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.


