News July 30, 2024

కృష్ణా: MBA/ MCA పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా వర్శిటీ పరిధిలోని కళాశాలలలో MBA/ MCA విద్యార్థులకు నిర్వహించే సప్లిమెంటరీ (One time Opportunity) పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. Y13, Y14, Y15, Y16, Y17, Y18తో ప్రారంభమయ్యే రిజిస్టర్డ్ నెంబర్ కలిగిన విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు ఆగస్టు 5లోపు అపరాధ రుసుము లేకుండా ఒక్కో సబ్జెక్టుకు రూ.2,000 ఫీజు చెల్లించాలని వర్శిటీ సూచించింది. వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలంది.

Similar News

News October 27, 2025

దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయండి: కలెక్టర్

image

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్న దృష్ట్యా గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలన్నారు.

News October 26, 2025

కృష్ణా: తుఫాన్‌ ప్రభావంపై డీపీఓ హెచ్చరిక

image

తుఫాన్‌ ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారిణి (డీపీఓ) జె.అరుణ సూచించారు. మట్టి మిద్దెలు, కల్వర్టులు, పూరి గుడిసెలు, రోడ్డు పక్కన గుడారాల్లో నివసించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. సచివాలయ ఉద్యోగులు, వీఆర్‌ఓలు, కార్యదర్శులు, ఇతర సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

News October 26, 2025

కృష్ణా: జిల్లాలో మండల ప్రత్యేక అధికారుల నియామకం

image

మొంథా తుపాన్ పరిస్థితులను అంచనా వేసేందుకు గాను జిల్లాలోని 25 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని సజావుగా తుపాన్ ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.