News October 16, 2024

కృష్ణా: MBA&MCA పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో MBA&MCA చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(Y20 నుంచి Y23 బ్యాచ్‌లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 5 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 24లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.

Similar News

News October 25, 2025

జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: కొల్లు రవీంద్ర

image

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వంపై బురదజల్లే పనిలో పడ్డారని గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. విజయవాడ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో సమన్వయ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు కృష్ణా జిల్లాను అరాచకాల నిలయంగా మార్చారన్నారు.

News October 25, 2025

కృష్ణా: సైకిల్‌పై కలెక్టరేట్‌కు వచ్చిన కలెక్టర్

image

శబ్ద, వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం కలెక్టరేట్‌కు సైకిల్ పై వచ్చారు. ప్రతి శనివారం కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు కలెక్టర్ జిల్లా అధికారులంతా సైకిల్‌పై రావాలని గత వారం ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే శనివారం ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్‌కు సైకిల్‌పై వచ్చారు. పలువురు కలెక్టరేట్ ఉద్యోగులు సైకిళ్లపై కార్యాలయానికి వచ్చారు.

News October 25, 2025

వర్షాలకు జిల్లాలో 316 హెక్టార్ల వరి పంట నష్టం

image

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కృష్ణా జిల్లాలో పంట నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ అధికారులు సేకరించిన అంచనా వివరాల ప్రకారం జిల్లాలో మొత్తం 316 హెక్టార్లలో వరి పంటలు దెబ్బతిన్నాయి. మచిలీపట్నం మండలంలో 33.6 హెక్టార్లు, పెడన మండలంలో 101 హెక్టార్లు, గూడూరు మండలంలో 20 హెక్టార్లు, కంకిపాడు మండలంలో 17 హెక్టార్లు, తోట్లవల్లూరు మండలంలో 8 హెక్టార్లలో వరి పంట నష్టపోయినట్లు అధికారులు పేర్కన్నారు