News December 9, 2024

కృష్ణా: MCA పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో MCA కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి 2025 జనవరి 3 వరకు మధ్యాహ్నం 2- సాయంత్రం 5 వరకు, 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి 2025 జనవరి 3 వరకు ఉదయం 10-మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్ణీత తేదీలలో జరుగుతాయని KRU తెలిపింది. పూర్తి వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చంది. 

Similar News

News April 19, 2026

కృష్ణా: Way2Newsలో ఉద్యోగ అవకాశాలు

image

కృష్ణా జిల్లాలో మండలాల వారీగా Way2Newsలో పని చేయడానికి రిపోర్టర్‌లు కావలెను. అర్హత: ఏదైనా ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన, చేసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి గల వారు <>ఈ లింక్‌ను క్లిక్ చేసి చేసి<<>> వివరాలు నమోదు చేయండి. త్వరలో మా టీమ్ మిమ్మల్ని సంప్రదిస్తుంది.

News April 19, 2026

కృష్ణా: రేపు కలెక్టరేట్‌లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్

image

జిల్లాలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గాను ఈ నెల 20వ తేదీన కలెక్టరేట్‌లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ మీటింగ్ హాలులో ప్రారంభమయ్యే గ్రీవెన్స్‌లో ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

News April 19, 2026

మచిలీపట్నంలో నేడు బంగారం ధర ఎంతంటే!

image

అక్షయ తృతీయ కావడంతో జిల్లా కేంద్రంమైన మచిలీపట్నంలోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. మచిలీపట్నంలో ఆదివారం గ్రాము బంగారం రూ. 15,078 పలుకుతోంది. 10 గ్రాములు రూ. 1,50,780 చొప్పున విక్రయిస్తున్నారు. వెండి గ్రాము రూ.280గా ఉంది. అక్షయ తృతీయలో కనీసం గ్రాము బంగారమైనా కొనాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు.