News September 12, 2024
కృష్ణా:70 మంది వరద బాధితులకు పాము కాటు

ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంభవించిన వరద విపత్తు ప్రజలకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. వరద నీటితో పాటు కొట్టుకొస్తున్న పాములు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో 70 మంది పాముకాటుకు గురయ్యారని వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులకు పాము కాట్ల బాధితులు వస్తున్నారన్నాయి.
Similar News
News February 26, 2026
అక్షర ఆంధ్ర లక్ష్యంగా ‘ఉల్లాస్-02’ అమలుకు కలెక్టర్ ఆదేశం

విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పాల్గొన్నారు. 100 శాతం అక్షరాస్యత సాధనకు కేంద్రం తెచ్చిన ‘ఉల్లాస్-02: అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిరక్షరాస్యత నిర్మూలనకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
News February 25, 2026
వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ సమీక్ష

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ డీకే బాలాజీ సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్తు సేవల పన్నులు (GST) సజావుగా, వంద శాతం వసూలయ్యేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పన్నుల వసూళ్లలో అలసత్వం వహించకుండా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.