News November 21, 2024
కృష్ణ: తంగడి కుంటలో మొసలి కలకలం
కృష్ణ మండలం పరిధిలోని తంగిడి కుంటలో బుధవారం మొసలి కలకలం రేపింది. గ్రామ కార్యదర్శి వీరేష్ వెళ్తుండగా మొసలి కనిపించిందని తెలిపారు. మొసలి ఉన్నట్లు గ్రామ ప్రజలకు సమాచారం అందించారు. అటువైపు వెళ్ళవద్దని మత్స్యకారులు, పశువుల కాపరులు కుంటలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Similar News
News December 3, 2024
MBNR: భోజన నాణ్యతపై ఫోకస్ పెట్టండి: కలెక్టర్
భోజన నాణ్యతలో రాజీ పడకూడదని, ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సోమవారం ప్రభుత్వ కళాశాల విద్యార్థుల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, అన్నింటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పలు సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గృహ సంక్షేమ అధికారి మాధవి, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.
News December 2, 2024
NRPT: ‘అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు తీస్తే చర్యలు’
రాజకీయ పార్టీ నేతలు, యూనియన్లు, ప్రజా సంఘాల నేతలు పోలీసుల అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. నేటి నుండి ఈనెల 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని చెప్పారు. ధర్నాలు, నిరసన ర్యాలీలు, మత పరమైన ర్యాలీలు పోలీసుల అనుమతులు లేకుండా నిర్వహించరాదని అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయన్నారు.
News December 2, 2024
నాణ్యమైన విద్యతో పేదరికాన్ని నిర్మూలన: హరగోపాల్
ప్రభుత్వాలు బడ్జెట్లో విద్యకు అవసరమయ్యే నిధులు కేటాయించాలని ప్రొఫెసర్ హరగోపాల్ సూచించారు. షాద్ నగర్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యతో పేదరికాన్ని నిర్మూలించవచ్చని అన్నారు. ప్రభుత్వాలు విద్యకు నిధుల కేటాయింపులు తగ్గిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య విధ్వంసానికి కారణాలను వెతికి పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు.