News February 28, 2025
కృష్ణ: మతిస్థిమితం లేని బాలుడి మృతి

కృష్ణ మండలంలో మతిస్థిమితం లేని బాలుడు మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాలిలా.. గుడెబల్లూర్కి చెందిన నరేష్ (14) మూడు రోజుల క్రితం మతిస్థిమితం లేక కళ్ళు సరిగ్గా కనబడక ఏదో గుర్తు తెలియని పానీయం తీసుకోగా.. అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. తల్లి మహాదేవి పిర్యాదు మేరకు ఎస్ఐ నవీద్ కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News November 28, 2025
BREAKING.. ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని ఓ రైతు నుంచి తహశీల్దార్ మహేందర్ రూ.15,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 28, 2025
చింతపల్లి: చిలకడదుంపలకు పెరిగిన గిరాకీ

చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో సాగవుతున్న చిలకడ దుంపలకు ఈ ఏడాది గిరాకీ ఏర్పడింది.
ఈ రెండు మండలాల్లో 200 ఎకరాల్లో ఈ పంట సాగావుతోంది. ఎకరాకు ₹25,000 పెట్టుబడి పెడితే ఖర్చులు పోను రూ.25000 ఆదాయం వస్తోందని అంటున్నారు. గతఏడాది బస్తా (80kg) రూ.800 కాగా ఈ ఏడాది రూ.1200కు పెరిగింది. దీనితో గిరి రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ఇక్కడ పండిన పంట రాజమండ్రి, విజయవాడ, బెంగుళూరు మార్కెట్లకు వెళుతోంది.
News November 28, 2025
చిత్తూరు: ‘జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలి’

అర్హులైన పేదలకు ప్రభుత్వాల సంక్షేమ పథకాలను చేరువచేసి, వారి అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం కృషి చేయాలని ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు సూచించారు. చిత్తూరు కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపీ అధ్యక్షతన కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీమోహన్, ZP సీఈవో రవికుమార్ ఉన్నారు.


