News February 28, 2025

కృష్ణ: మతిస్థిమితం లేని బాలుడి మృతి

image

కృష్ణ మండలంలో మతిస్థిమితం లేని బాలుడు మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాలిలా.. గుడెబల్లూర్‌కి చెందిన నరేష్ (14) మూడు రోజుల క్రితం మతిస్థిమితం లేక కళ్ళు సరిగ్గా కనబడక ఏదో గుర్తు తెలియని పానీయం తీసుకోగా.. అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. తల్లి మహాదేవి పిర్యాదు మేరకు ఎస్ఐ నవీద్ కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News March 22, 2025

కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. ఇద్దరికి గాయాలు

image

రామారెడ్డి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన మీసేవ నిర్వాహకుడు దినేశ్ మృతి చెందాడు. ఎస్ఐ నరెశ్ తెలిపిన వివరాల ప్రకారం.. బైక్‌పై వెళ్తున్న దినేశ్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ప్రమాదంలో ఆటోలోని ఇద్దరు ప్రయాణికులతో పాటు డ్రైవర్ లింబాద్రికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

News March 22, 2025

ఎర్త్ అవర్‌లో స్వచ్ఛందంగా పాల్గొనండి: CBN

image

AP: నేడు ఎర్త్ అవర్ సందర్భంగా గంట పాటు లైట్లను ఆపేసే కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని CM CBN పిలుపునిచ్చారు. మనందరికీ ఆవాసమైన భూమిని కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు. ఈ ఏడాది ప్రపంచ జల దినోత్సవం రోజునే ఎర్త్ అవర్ వచ్చిందన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌కు నీటి భద్రత, ఇంధన ఖర్చు తగ్గించడమే కీలకమని చెప్పారు. మనం చేసే చిన్న పనులే పెద్ద మార్పునకు దారి తీస్తాయనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.

News March 22, 2025

నంద్యాల జిల్లాలో దారుణ హత్య

image

బండిఆత్మకూరు మండలం లింగాపురంలో శనివారం దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నంద్యాల సుధాకర్ రెడ్డి పొలం వద్దకు వెళ్తుండగా కొత్తచెరువు దగ్గర మాటువేసిన గుర్తుతెలియని దుండగులు ఆయనను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

error: Content is protected !!