News February 14, 2025
కృష్ణ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కృష్ణ మండల పరిధిలోని హిందూపూర్ శివారులో <<15459766>>లారీని ఢీకొట్టిన ఘటన<<>>లో ఇద్దరికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మహాదేవి(50) మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు.. బైక్‌పై వెళ్తున్న వీరు లారీని ఢీకొట్టడంతో మహేశ్(40), మహాదేవిలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం రాయచూర్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. మహాదేవి మృతి చెందిందని, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
Similar News
News March 21, 2025
మెదక్: రూ.1,70,42,046 ఆస్తిపన్ను చెల్లించిన జిల్లా జడ్జి

మెదక్ కోర్టు భవనాల ఆస్తి పన్ను బకాయి మొత్తాన్ని జిల్లా జడ్జి లక్ష్మీ శారద చెల్లించారు. జిల్లా జడ్జికి మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గత కొంతకాలంగా కోర్టు భవనాల ఆస్తిపన్ను బకాయి ఉండడం వల్ల ఈ విషయాన్ని జిల్లా జడ్జి లక్ష్మీ శారద దృష్టికి మున్సిపల్ అధికారులు తీసుకెళ్లారు. తక్షణమే స్పందించి రూ.1,70,42,046 ను గురువారం చెల్లించారు.
News March 21, 2025
ASF: 400 మందికి దరఖాస్తులు కావడం లేదు..!

జిల్లాలోని నాయీ బ్రాహ్మణులు నేడు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. గత 2023-24 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని నాయీ బ్రాహ్మణులు 400మంది బీసీ బంధు కోసం దరఖాస్తు చేసుకున్నామన్నారు. అది రాకపోగా.. నేడు రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తులు కావడం లేదని వాపోయారు. ఆన్‌లైన్ చేస్తుంటే అప్లై కావడం లేదని.. సమస్యను పరిష్కరించాలని కోరారు.
News March 21, 2025
ఉస్మానియా యూనివర్సిటీ బీసీఏ పరీక్షా తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీసీఏ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల మూడవ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.