News February 14, 2025

కృష్ణ: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన ఘటన కృష్ణ మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గుడేబల్లూరుకి చెందిన మహేశ్, మహదేవి(50)లు బైక్‌పై తహశీల్దారు కార్యాలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో హిందూపూర్-టై రోడ్డుపై ఆగిఉన్న లారీని వెనుకనుంచి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో వీరిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. 

Similar News

News March 8, 2026

కామారెడ్డి: మహిళా అధికారులే ఆదర్శం

image

కామారెడ్డి జిల్లాలో పలు శాఖల్లో ఉన్నత స్థానంలో మహిళలే అధికారులుగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తూ మహిళలకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా జూనియర్ సివిల్ జడ్జి బట్టు దీక్ష, DLSA కార్యదర్శి నాగరాణి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎఫ్ఓ నిఖిత, డీడబ్ల్యూఓ ప్రమీల, డీసీపీఓ డా.స్రవంతి, హార్టికల్చర్ ఆఫీసర్ జ్యోతి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.విద్య ఆదర్శంగా నిలుస్తున్నారు.

News March 8, 2026

మంచిర్యాల: సర్వేయర్ల కొరతతో నిలిచిపోతున్న సర్వే

image

మంచిర్యాల జిల్లాలో సర్వేయర్ల కొరతతో భూ సర్వే నిలిచిపోతోంది. మొత్తం 18 మండలాలు ఉండగా, కేవలం 8 మండలాలకే ప్రభుత్వ సర్వేయర్లు ఉన్నారు. దీంతో ఒక్కో సర్వేయర్‌కు రెండు, మూడు మండలాల బాధ్యతలను అధికారులు అప్పగించారు. పిటీషన్ పెట్టుకున్న దరఖాస్తుదారుల భూముల సర్వేలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ లైసెన్స్ సర్వేయర్లు వచ్చిన వారికి విధులు, బాధ్యతలు అప్పగించలేదు. జిల్లాలో భూముల సర్వే నత్త నడకన కొనసాగుతోంది.

News March 8, 2026

యంగ్ సైంటిస్ట్ ఎక్స్‌పోలో తెల్లాపూర్ విద్యార్థుల సత్తా

image

నిర్మాణ్ యంగ్ సైంటిస్ట్ ఎక్స్‌పోలో రామచంద్రపురం మండలం తెల్లాపూర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు అదరగొట్టారు. మాదాపూర్‌లో జరిగిన పోటీల్లో వీరు రూపొందించిన ‘ఆల్కహాల్ డిటెక్టర్’ ప్రాజెక్టుకు రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం దక్కినట్లు హెచ్ఎం భాస్కర్ తెలిపారు. 7వ తరగతి విద్యార్థులు కార్తీక్, శ్రీరామ్, 8వ తరగతి విద్యార్థులు శివానంద్, అగ్నిమణి ప్రతిభను ఉపాధ్యాయులు, గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.