News December 18, 2024
కెనడాలో గాజువాక యువకుడి మృతి

చదువుకోవడానికి కెనడా వెళ్లిన గాజువాక యువకుడు అక్కడ ఆకస్మికంగా మృతి చెందాడు. డ్రైవర్స్ కాలనీకి చెందిన నాగప్రసాద్ కుమారుడు ఫణికుమార్ 4 నెలల క్రితం ఎంఎస్ చదివేందుకు కెనడా వెళ్ళారు. శనివారం తన రూమ్మేట్ ఫణి కుమార్ చనిపోయినట్లుగా తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. దీంతో వారు ప్రజాప్రతినిధులు, కలెక్టర్ను కలిసి తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకురావాలని వేడుకున్నారు. కాగా ఫణి మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 12, 2025
విశాఖ: SI ట్రైనింగ్ పూర్తయ్యినా పోస్టింగులు లేవు

ట్రైనింగ్ పూర్తిచేసుకున్న SIలకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై విశాఖ రేంజ్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 4 రేంజ్లలో ఇప్పటికే పోస్టింగులు ఇచ్చినా.. విశాఖ రేంజ్కే జాప్యం కొనసాగుతోంది. డిసెంబర్ 5తో ట్రైనింగ్ పిరియడ్ పూర్తయింది. విశాఖ రేంజ్లో మొత్తం 49 మంది SIలకు ట్రైనింగ్ పూర్తైనా ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. మరోపక్క నగరంలో పోలీసు సిబ్బంది కొరత ఉండటంతో లా అండ్ ఆర్డర్కు కష్టమౌతోంది.
News December 12, 2025
విశాఖకు 100 ఎలక్ట్రానిక్ బస్సులు వస్తున్నాయ్..!

త్వరలోనే 100 ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు విశాఖలో రొడ్డెక్కనున్నాయి. ఈ ఎలక్ట్రికల్ బస్సుల ఛార్జింగ్ స్టేషనులకు భారీగా ఖర్చు అవుతుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. హై స్పీడ్తో కూడిన ఛార్జింగ్ కేంద్రాలు 20 వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తొంది. విశాఖలో ప్రస్తుతం 175 బస్సులు అవసరం ఉండగా.. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఇబ్బందులు ఉండవని భవిస్తున్నారు.
News December 12, 2025
కైలాసగిరిపై రూ.20 కోట్లతో కొత్త ప్రాజెక్టులు

కైలాసగిరిపై ఎకో హైట్స్ కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్, బే వ్యూ కేఫ్లను అభివృద్ధి చేయనున్నట్టు VMRDA కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. నవంబర్ 29న జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 1.99 ఎకరాల్లో రూ.20 కోట్ల వ్యయంతో కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్, కేఫ్లను నిర్మిస్తామన్నారు. ఈ ప్రాజెక్టులు కైలాసగిరిపై ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు.


