News March 24, 2025
కెరమెరి: కుక్కకాటు.. బాలుడి మృతి

కుక్కకాటుతో 4ఏళ్ల బాలుడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కెరమెరికి చెందిన చౌహాన్ రుద్ర దాస్,సరోజ దంపతుల కుమారుడు రిషిని కొద్ది రోజుల కిందట కుక్క కరిచింది. అప్పుడు తల్లిదండ్రులు హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఇంటికొచ్చిన కొద్దిరోజులకు బాలుడిలో మళ్లీ రేబిస్ లక్షణాలు కనిపించాయి. దీంతో కాగజ్నగర్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.
Similar News
News March 30, 2025
అనకాపల్లిలో పీజీఆర్ఎస్ రద్దు

ఈనెల 31 సోమవారం రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వ సెలవు ప్రకటించడంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అనకాపల్లి జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల కేంద్రాలు, సచివాలయాల్లో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించబడదన్నారు. జిల్లా ప్రజలంతా గమనించాలని ఆమె కోరారు.
News March 30, 2025
నిర్మల్: ఉగాది వేడుకల్లో మాజీ మంత్రి

నిర్మల్లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఉగాది వేడుకలను ధనరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా జానపద జాతర సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక జానపద పాటలు, నృత్యాలు విశేషంగా అలరించాయి. రేలారే రేలా ఫెమ్ రవి బృందం ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
News March 30, 2025
జాతర గోడపత్రుల ఆవిష్కరించిన ASF ఎమ్మెల్యే

రెబ్బెన మండలం ఇందిరానగర్లో వెలసిన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభు మహంకాళి దేవస్థానంలో ఏప్రిల్ 12, 13న జరిగే మహంకాళి అమ్మవారి జాతర పోస్టర్లను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆవిష్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు దేవార వినోద్ మాట్లాడుతూ.. కొమరం భీం జిల్లా భక్తుల కొంగు బంగారంగా ఉన్న కనకదుర్గమ్మ దేవి జాతరకు భక్తులు పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.