News March 7, 2025
కెరమెరి: గిరిజన సాహస పుత్రిక కన్నిబాయి

భీమన్ గొందికి చెందిన మడవి కన్నీబాయి మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది. మారుమూల గిరిజన గ్రామంలో పుట్టి సాహస క్రీడల్లో సరికొత్త చరిత్ర లిఖించి ఆదివాసీ ముత్యంగా మెరిసింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇంటర్ వరకు చదివి ఆపేశారు. చిన్నతనం నుంచి క్రీడలపై ఉన్న ఆసక్తితో పారాసైలింగ్, రాపెలింగ్, జూమరింగ్ క్రీడల్లో సత్తా చాటింది. కాగా ఎవరెస్టు శిఖరం అధిరోహించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు.
Similar News
News December 4, 2025
బాత్రూమ్లో ఎంతసేపు ఉంటున్నారు?

డీహైడ్రేషన్, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఫైబర్ కొరత వల్ల మలబద్ధకం ఏర్పడుతుందని అందరూ అనుకుంటారు. టాయిలెట్ను ఆపుకోవడం, బాత్రూమ్లో ఎక్కువసేపు గడపడమూ మలబద్ధకానికి కారణమేనంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు. ‘పెద్దపేగు, పురీషనాళం అనుసరించే లయను విస్మరిస్తే మలం గట్టిగా మారుతుంది. ఫోన్ చూస్తూ 10 ని.ల కంటే ఎక్కువసేపు బాత్రూమ్లో కూర్చోవడం వల్ల మల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది’ అని పేర్కొంటున్నారు.
News December 4, 2025
మలబద్ధకాన్ని నివారించాలంటే?

* టాయిలెట్ వచ్చినప్పుడు వెంటనే వెళ్లాలి. రోజూ ఒకే సమయాన్ని అనుసరించాలి.
* సాధ్యమైనంత వరకు ఇండియన్ టాయిలెట్లను ఉపయోగించండి. వాటిని వాడటంలో సమస్యలుంటే వెస్ట్రన్ టాయిలెట్ల ముందు పీఠను ఉపయోగించి మోకాళ్లను కాస్త పైకి ఉంచుకోవాలి. ఇది మల మార్గాన్ని సులభతరం చేస్తుంది.
* 5-10 ని.ల కంటే ఎక్కువ సేపు బాత్రూమ్లో ఉండొద్దు.
* ఫుడ్లో తగినంత ఫైబర్, సరిపడినన్ని నీళ్లు తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
News December 4, 2025
ఎక్సైజ్ సవరణ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు: వద్దిరాజు

మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. దేశ ఆర్థిక పురోగతికి విశేష కృషి చేశారని గురువారం పార్లమెంట్లో జరిగిన సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుపై మాట్లాడారు. సామాజిక కోణంలో కాకుండా ఆర్థిక సంబంధమైన ముఖ్యమైన అంశాలతో కూడిన ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతునిస్తుందన్నారు. మద్యం దుకాణాల కేటాయింపుల్లో గౌడ కులస్తులకు 15% రిజర్వేషన్ ఇచ్చామన్నారు.


