News February 21, 2025

కెరమెరి: చదువుపై దృష్టి సారించాలి: ఐటీడీఏ పీఓ

image

చదువుపై దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా విద్యార్థులకు సూచించారు. గురువారం కెరమెరి మండలంలోని బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఆశ్రమ పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రాంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. రానున్న పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Similar News

News November 14, 2025

సతీష్ ఈరోజు విచారణకు రావాల్సి ఉంది?.. ఇంతలోనే..

image

తిరుపతి పద్మావతి అతిథి గృహంలో జరుగుతున్న పరకామణి కేసు సీఐడీ విచారణకు రెండోసారి మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ శుక్రవారం రావాల్సి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం గుంతకల్ రైల్వే డివిజన్లో పని చేస్తున్న సతీష్.. తిరుపతి విచారణకు వచ్చే క్రమంలో ఈ <<18284097>>అనుమానాస్పద మృతి<<>> పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఓ విజిలెన్స్ అధికారి, సీఐను సీఐడీ బృందం విచారణ చేస్తుంది.

News November 14, 2025

అనధికార షాపులను తొలగించాలి: ఈవో వెంకట్రావు

image

యాదాద్రి ఆలయ పరిసరాల్లో ప్రైవేట్‌ ప్రకటనలు, ఫ్లెక్సీలను, అనధికారిక షాపులను నిషేధించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఈవో వెంకటరావు అధికారులను ఆదేశించారు. ఆలయ భూములు కబ్జాకు గురికాకుండా కాంపౌండ్‌ వాల్‌, బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలని, దుకాణాల వద్ద ధరల వివరాలు తప్పక ఉంచాలని స్పష్టం చేశారు. సేవాభావంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు.

News November 14, 2025

పోలీస్ మైదానం పనులు పరిశీలించిన ఎస్పీ శ్రీనివాసరావువాస రావు

image

పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న క్రికెట్ మైదానం పనులను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మైదానం నిర్మాణాన్ని వేగవంతం చేసి, పోలీస్ సిబ్బంది వినియోగానికి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ మైదానం సిబ్బంది శారీరక దారుఢ్యం, క్రీడాస్ఫూర్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.